సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మహిళలందరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగపరుచుకోవాలి. స్వయం సహాయక సంఘాల్లోని మహిళలందరూ కలిసికట్టుగా ఉండి ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్లాలని నాగిరెడ్డిపేట్ ఎంపీడీవో గంగాధర్ సూచించారు.సోమవారం నాగిరెడ్డిపేట మండల సమైక్య కేంద్రంలో ఏర్పాటు చేయబడిన మండల సమాఖ్య సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎంపీడీవో గంగాధర్ మాట్లాడుతూ మహిళలందరూ కలిసికట్టుగా ఉండాలని స్వయం సహాయక సంఘాల రుణాలను సద్వినియోగపరచుకోవాలని కోరారు.
గతంలో కంటే ఇప్పుడు రుణ రికవరీ శాతం పెరిగిందని,గతంలో 9 శాతం ఉన్న స్త్రీనిధి రికవరీ ఉంటే ఇప్పుడు 37 శాతం కు పెరిగిందని గడిచిన 3 నెలల్లో సుమారు 54 లక్షల రూపాయల మొండి బకాయిలు వసూలు చేయడం పట్ల ఎంపీడీవో గంగాధర్ ఏపిఎం మరియు సిబ్బందిని ప్రశంసించడం జరిగింది.వ్యవసాయ అధికారి సాయికిరణ్ మహిళా సంఘ సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఇల్నోనో పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని అందరు రైతులు కూడా ఆర్తడి పంటలను మాత్రమే సాగు చేయాలని అదేవిధంగా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు.
అనంతరం ఉపాధి హామీ ఎపిఓ సక్కుబాయి మహిళా సంఘాల సభ్యులను ఉద్దేశించి మాట్లాడుతూ... ఇంకుడు గుంతల, పాంఫండ్స్ ఆవశ్యకతను వివరిస్తూ ప్రతి గ్రామ సంఘానికి రెండు పాంఫండ్స్ పెట్టుకోవడానికి లబ్ధిదారులను గుర్తించాలని కోరడం జరిగింది. యూనియన్ బ్యాంక్ ఫీల్డ్ ఆఫీసర్ గౌరవ్ షిండే మాట్లాడుతూ మహిళా స్వయం సహాయక సంఘాలు తీసుకున్న రుణాలు అన్నిటిని సకాలంలో చెల్లించి వడ్డీ లేని రుణ లబ్ధిని పొందాలని ఆయన సూచించడం జరిగింది.
ఇంకా బ్యాంకు లింకేజీ స్త్రీ నిధి సంస్థ గత నిర్మాణం కోడి పిల్లలు మరియు గొర్రె పిల్లల పెంపకం కార్యక్రమాలు మార్కెటింగ్ సెంటర్లు తదితరులు అంశాల గురించి చర్చించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఏపీఎం దత్తు మండల సమైక్య అధ్యక్షురాలు శాంతమ్మ,కార్యదర్శి మంజుల, సీసీలు నజీర్, రవి,రాజు,రాజయ్య, సావిత్రి,అకౌంటెంట్ రాజు, ఫీల్డ్ అసిస్టెంట్ మేనేజర్ అమల తదితరులు పాల్గొన్నారు.