దోమకొండ ఎక్సైజ్ సీఐ కి సన్మానం

09-10-2026 | 10:27pm

తాడ్వాయి,అక్టోబర్,09 ( విజయక్రాంతి ): కామారెడ్డి జిల్లా(Kamareddy District) దోమకొండ ఎక్సైజ్ సీఐ సర్వేశ్వర రావు(Domakonda Excise CI Sarveswara Rao) ను జై గౌడ ఉద్యమం జిల్లా అధ్యక్షులు రంగోల్ల మురళి గౌడ్(Rangolla Murali Goud) ఘనంగా సమర్ధించారు.ఈ సందర్భంగా మురళి గౌడ్ మాట్లాడుతూ... నూతనంగా పదవి బాధ్యతలు తీసుకున్న సిఐ కలవడం ఆనందంగా ఉందని తెలిపారు. తమ విధులు సక్రమంగా నిర్వహిస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా చూడాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జై గౌడ ఉద్యమం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు