పెద్దమల్లారెడ్డిలో అన్నదాన కార్యక్రమం
17-10-2026 | 04:41pm
భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామం(Peddamallareddy village)లో హిందూదళ్ అసోసియేషన్(Hindu Dal Association) ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్నదాన కార్యక్రమం(Annadanam program) నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. నవరాత్రుల సందర్భంగా అన్నదానం చేపట్టడం ఆనందంగా ఉందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.