రేపు మంథనిలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటన

17-10-2026 | 05:04pm

600 మంది మహిళలకు కుట్టు శిక్షణ సర్టిఫికెట్ల ప్రదానం

రూ. కోటి విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

మహిళా ఇందిరా శక్తి ఆయిల్ మిల్లు ప్రారంభోత్సవం

మంథని, అక్టోబర్ 17(విజయక్రాంతి) : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు(Duddilla Sridhar Babu) ఆదివారం మంథని నియోజకవర్గంలో(Manthani Constituency) విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా మహిళా సాధికారత, ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో పాటు పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల్లో మంత్రి పాల్గొంటారని ఆయన పీఏ ఎ. చంద్రశేఖర్ ఒక ప్రకటనలో వెల్లడించారు.

ఉచిత కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న వారికి సర్టిఫికెట్లు:

మంథని మున్సిపల్ పరిధిలో అలిఫ్, డీఆర్‌డీఏ, మెప్మా మరియు కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ(Free Sewing Training) పూర్తి చేసుకున్న 600 మంది మహిళలకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంత్రి సర్టిఫికెట్లను అందజేయనున్నారు. నియోజకవర్గవ్యాప్తంగా మహిళలకు స్వయం ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఇప్పటివరకు మొత్తం 3,040 మందికి ఉచిత కుట్టు శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్లు అందజేసినట్లు పీఏ పేర్కొన్నారు.

రూ. కోటి విలువైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

ఆరోగ్యశ్రీ(Aarogyasri) పరిధిలోకి రాని ఆపత్కాలాల్లో పేదలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రభుత్వం మంజూరు చేసిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను మంత్రి పంపిణీ చేయనున్నారు. సుమారు కోటి రూపాయల విలువైన ఈ చెక్కులను 302 మంది లబ్ధిదారులకు మంత్రి స్వయంగా అందజేస్తారు.

మహిళా ఇందిరా శక్తి ఆయిల్ మిల్లు ప్రారంభం

మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చేపట్టిన ‘మహిళా ఇందిరా శక్తి’ పథకం(‘Mahila Indira Shakti’ Scheme) కింద మెప్మా ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయ మార్గంలో నూతనంగా మంజూరైన ఆయిల్ మిల్లును(Oil mill) మధ్యాహ్నం 2 గంటలకు మంత్రి ప్రారంభించనున్నారు. అనంతరం పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ మహాలక్ష్మి దేవాలయాన్ని దర్శించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమాల్లో నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

మరిన్ని వార్తలు