కాచాపూర్‌ సొసైటీ ప్రత్యేక ఏర్పాటుపై హర్షం

02-10-2026 | 05:21pm

భిక్కనూర్, అక్టోబర్‌ 2 (విజయక్రాంతి): బస్వాపూర్‌ సొసైటీ నుంచి కాచాపూర్‌ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం పట్ల మాజీ ఎంపీపీ, మాజీ సర్పంచ్‌, పీఏసీఎస్‌ బస్వాపూర్‌ మాజీ డైరెక్టర్‌ బైండ్ల సుదర్శన్‌(Baindla Sudarshan) హర్షం వ్యక్తం చేశారు. కాచాపూర్‌ సొసైటీని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని గతంలో పలుమార్లు ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. 2003-04లో సొసైటీ నష్టాల్లోకి వెళ్లడంతో బస్వాపూర్‌ సొసైటీలో విలీనం చేశారని పేర్కొన్నారు. అనంతరం పలుమార్లు ఎన్నికల్లో పోటీ చేసి ప్రత్యేక సొసైటీ కోసం ప్రయత్నించినట్లు తెలిపారు.

ప్రస్తుత ప్రభుత్వం, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ సహకారంతో సొసైటీని ప్రత్యేకంగా ఏర్పాటు చేయడానికి చర్యలు చేపట్టారని తెలిపారు. అక్టోబర్‌ 1న కాచాపూర్‌ సొసైటీ ప్రత్యేకంగా ఏర్పాటైనట్లు వెల్లడించారు. ఇందుకు సహకరించిన షబ్బీర్‌ అలీ, ఆయన కుటుంబ సభ్యులు, కాంగ్రెస్‌ నాయకులు, ప్రజాప్రతినిధులు, గ్రామపెద్దలు, రైతులు, గ్రామస్థులకు కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు