గాంధీజీ ఆశయాలను ఆచరించాలి
వెంకటాపూర్, అక్టోబర్ 2 (విజయక్రాంతి): గాంధీ జయంతిని(Gandhi Jayanti) పురస్కరించుకుని మండల కేంద్రంలోని వేదవ్యాస ఉన్నత పాఠశాలలో(Vedavyasa High School) మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ సూర్యప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ.. గాంధీజీ సత్యం, అహింస, శాంతి, స్వచ్ఛత వంటి ఉన్నత విలువలను సమాజానికి అందించారని, విద్యార్థులు గాంధీజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని నిత్య జీవితంలో ఆచరించాలని సూచించారు. అనంతరం పాఠశాల సిబ్బంది విజయ్, భవానితో పాటు విద్యార్థులు గాంధీజీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఆయన దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.