రైతుల పాత్రను గుర్తించిన మహానేత శాస్త్రి..
తాడ్వాయి, అక్టోబర్ 02 (విజయక్రాంతి): దేశ రక్షణలో సైనికుల పాత్రను, దేశ అభివృద్ధిలో రైతుల పాత్రను గుర్తించిన మహానేత లాల్ బహదూర్ శాస్త్రి అని ప్రతినిధులు కొనియాడారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎండ్రియాల గ్రామంలో భారతదేశ రెండవ ప్రధాని మంత్రి అయిన మహానేత లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ప్రతినిధులు మాట్లాడుతూ... జై జవాన్... జై కిసాన్.. అనే నినాదాన్ని అందించిన మహానేత శాస్త్రి అన్నారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడంలో ఆయన పాత్ర కీలకమైందన్నారు. ఆహార ఉత్పత్తి పెంపు పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషిచేసిన మహానీయుడు శాస్త్రి అన్నారు. అనంతరం భారతదేశంలో హరిత విప్లవం శ్వేత విప్లవం అభివృద్ధికి ఈ దశలోనే ప్రయత్నాలు కొనసాగి పునాదులుగా నిలిచాయన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కొర్ని నర్సింలు, ఉపసర్పంచ్ నర్సారెడ్డి, నాయకులు సిద్ధిరాంరెడ్డి, రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.