కుష్ఠు వ్యాధి గుర్తింపునకు ప్రత్యేక సర్వే

17-10-2026 | 04:43pm

భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(Bhikkanoor PHC) పరిధిలో ఈ నెల 22 నుంచి నవంబర్‌ 4 వరకు అన్ని గ్రామాల్లో లెప్రసీ కేస్‌ డిటెక్షన్‌ క్యాంపెయిన్‌ (Leprosy Case Detection Campaign) నిర్వహించనున్నట్లు వైద్యాధికారి డాక్టర్‌ యమీమా తెలిపారు. ఆశా కార్యకర్తలు(ASHA workers) ప్రతిరోజూ 20 ఇళ్లను సందర్శించి, చర్మంపై మచ్చలు ఉన్నవారిని గుర్తించి పీహెచ్‌సీకి పంపించాలని సూచించారు. కార్యక్రమంలో పీహెచ్‌ఎన్‌ జానకి, సూపర్‌వైజర్లు సువర్ణ, రాజమణి, ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం పీహెచ్‌సీలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు.

మరిన్ని వార్తలు