నాగిరెడ్డిపేట్లో పలు గ్రామాల్లో అభివృద్ధి పనులకు శ్రీకారం
ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు
నాగిరెడ్డిపేట్, నవంబర్ 6 (విజయక్రాంతి): మండలంలోని పోచారం గ్రామంలో(Pocharam Village) ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు(MLA Madan Mohan Rao) పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. నూతన మహిళా సంఘ భవన నిర్మాణం(New Women's Association Building) కోసం ప్రభుత్వం మంజూరు చేసిన పది లక్షల నిధులతో చేపట్టనున్న భవన నిర్మాణం పనులకు భూమి పూజ చేశారు.ప్రభుత్వ పాఠశాలలో నూతన తరగతుల నిర్మాణం కోసం 13.55 లక్షల నిధులు మంజూరు చేసిన నేపథ్యంలో పాఠశాలను సందర్శించారు.
సర్వేనెంబర్ 268 రైతులతో మాట్లాడి భూముల రి-సర్వే నిర్వహించి అధికారుల పూర్తి నివేదిక తీసుకున్న అనంతరం ఆ నివేదిక ఆధారంగా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో మాట్లాడి రైతులకు న్యాయం జరిగేలా చూస్తానని, అర్హులైన రైతులకు పట్టా పాస్ బుక్కులు అందేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే మదన్మోహన్రావు తెలిపారు. పోచారం ప్రాజెక్టు అభివృద్ధి గెస్ట్ హౌస్ నిర్మాణం తదితర పనుల కోసం సుమారు 8 కోట్లు నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు.
అలాగే మాల్తుమ్మెద గ్రామంలో 20వేల మెట్రిక్ టన్నుల పోదాం నిర్మాణానికి భూమి పూజ చేశారు.14.48 కోట్ల వ్యాయామంతో నిర్మాణం రైతులకు పంటల నిల్వలో ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. గోపాల్పేట్ గ్రామంలో గూడా స్వప్న కిషన్ మరియు చాకలి శైలు శకుంతల కుటుంబాలు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం చేపట్టారు.
గోపాల్పేట్ జెడ్పి హెచ్ఎస్ పాఠశాలలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఎమ్మెల్యే మదన్మోహన్రావు ప్రత్యేక కృషితో 1.50 కోట్ల రూపాయలు నిధులు మంజూరు కావడం, వాటితో నియోజకవర్గంలోని 11 పాఠశాలలో నూతన భవనల నిర్మాణాలు చేపట్టనుండడంతో పాఠశాల విద్యార్థులు ఉపాధ్యాయులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సర్పంచులు సంజీవరావు,పుప్పాల సాయిలు,వంశీకృష్ణ గౌడ్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్,నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షుడు ప్రభాకర్,ఎంపీడీవో గంగాధర్ ఎమ్మార్వో వెంకట్ రెడ్డి,వివిధ అధికారులు, నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.