పద్మశాలి సంఘం జిల్లా కార్యవర్గం ఎన్నిక

11-10-2026 | 06:12pm

జిల్లా ఉపాధ్యక్షులుగా సీనియర్ జర్నలిస్టు 

జుక్కల్, అక్టోబర్ 11 (విజయ క్రాంతి) : కామారెడ్డి జిల్లా(Kamareddy District) కేంద్రంలో నిర్వహించిన పద్మశాలి సంఘం నూతన కార్యవర్గం ఎన్నుకున్నారు.  జుక్కల్ ప్రాంతంలో సీనియర్ జర్నలిస్టు(Senior Journalist) అయిన బోడ సాయిలు ను ఉపాధ్యక్షులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో అయన ఉపాధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం చేశారు. జుక్కల్ నియోజకవర్గం లో పద్మశాలి సమాజంలో చురుకైన పాత్ర పోషిస్తూ మార్కండేయ మందిరాల నిర్మాణానికి కృషి చేస్తున్నారు.

బోడ సాయిలు సేవలను గుర్తించి ఆయన్ను జిల్లా ఉపాధ్యక్షులు గా ఎంపికచేయడం పట్ల జుక్కల్ వాసులు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు వాళ్లకాటి రాజకుమార్, జిల్లా అధ్యక్షులు సిరిగధ లక్ష్మి నరసింలు సమక్షలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈయనతో పాటు కార్యదర్శి గా మేర్గే దత్తాత్రి కార్యదర్శి గా ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమం లో జుక్కల్ పద్మశాలి సంఘం నాయకులు దోమల అశోక్, దోమల నాగనాథ్, సుభాష్, దుర్కవర్ హన్మాండ్లు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు