అన్నవరం యాత్రలో ప్రమాదం...

02-10-2026 | 11:55pm

సదాశివనగర్ మండలానికి చెందిన వారిగా గుర్తింపు 

సదాశివనగర్, అక్టోబర్ 2 (విజయక్రాంతి): మండలం నుండి అన్నవరం(Annavaram) తీర్థయాత్రకు వెళ్తుండగా ఆంధ్రప్రదేశ్ లోని తుని సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కొంతమంది మహిళలు మృతి చెందినట్లు  సమాచారం.మృతులు సదాశివనగర్ మండలానికి చెందినవారై ఉండవచ్చని సమాచారం.

సదాశివనగర్ మండలం కుప్రియల్ గ్రామానికి చెందిన కుమ్మరి రాజమణిగా ఒక మహిళను గుర్తించారు. ప్రమాదా ఫోటోలను పోలీసులు పలు వాట్సాప్ గ్రూప్ లలో పెట్టారు.మహిళలను ఎవరైనా గుర్తుపట్టినట్లయితే, వారి పేరు, గ్రామం మరియు కుటుంబ సభ్యుల వివరాలను వెంటనే సదాశివనగర్ పోలీసులకు తెలియజేయలని కోరారు.

మరిన్ని వార్తలు