బీసీ హక్కుల సాధనకై పార్లమెంటు ముట్టడి: బీసీ జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్

03-10-2026 | 12:14am

వెల్దండ అక్టోబర్ 2: బీసీ హక్కుల సాధనకై పార్లమెంటు ముట్టడి చేయనున్నట్లు జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజాల శ్రీనివాస్ గౌడ్(Jajala Srinivas Goud) అన్నారు. వెల్దండ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి జాజాల శ్రీనివాస్ గౌడ్ పూలమాలవేసి  అనంతరం విలేకరులతో మాట్లాడారు.

ఓబీసీకి చెందిన భారత ప్రధానిగా నరేంద్ర మోడీ 10 సంవత్సరాలు ప్రధానిగా ఉన్న ఒరగబెట్టింది ఏమీ లేదని అందుకే బీసీల కోసం భారత రాజ్యాంగం కల్పించిన హక్కుల సాధన కోసం పార్లమెంటును ముట్టడించే కార్యక్రమం చేపట్టినట్లు ఆయన వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోడీ బీసీలపై కపట ప్రేమ నటిస్తూ విద్యా ఉద్యోగ రంగాల్లో దగా మోసం చేస్తున్నారని ఆయన తీయబడ్డారు.

నవంబర్ మాసం తర్వాత నిర్వహించే శీతాకాల సమావేశంలో బీసీ కులగలను చేపట్టడానికి తీర్మానం చేయాలని ఈనెల 8న జాతీయ బీసీ సంక్షేమ సంఘ సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే పార్లమెంటు ముట్టడి ఖాయమన్నారు. కార్యక్రమంలో బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ ముదిరాజ్ నాయకులు సదానంద గౌడ్, జంగయ్య, నిరంజన్, స్కైలాబ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు