దేవరాజన్ నియామకంపై ఏఐఎస్బి నేతల అభినందనలు
జి. దేవరాజన్ నియామకంపై ఏఐఎస్బి నేతల అభినందనలు
కరీంనగర్ సిటీ (విజయక్రాంతి): కేరళ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా జి. దేవరాజన్ నియమితులైన సందర్భంగా ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్(All India Forward Block) తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ అంబటి జోజి రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (A) కే . తేజ్ దీప్ రెడ్డి ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
దేవరాజన్‌కు అప్పగించిన నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ కేరళ రాష్ట్ర అభివృద్ధికి, కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయానికి కృషి చేయాలని వారు ఆకాంక్షించారు. ఆయనకు లభించిన ఈ బాధ్యత ఏఐఎస్బి శ్రేణులకు మరింత ఉత్సాహాన్ని అందిస్తుందని పేర్కొన్నారు.
అదేవిధంగా తెలంగాణలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్‌ను క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ పార్టీని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కార్యాచరణను విస్తృతం చేస్తామని అంబటి జోజి రెడ్డి, కే . తేజ్ దీప్ రెడ్డి తెలిపారు.
పార్టీ సిద్ధాంతాలు, ప్రజా సమస్యలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు యువత, కార్మికులు, రైతులు, మహిళలను పార్టీతో అనుసంధానం చేస్తూ తెలంగాణలో ఏఐఎస్బి ను మరింత బలమైన ప్రజా శక్తిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని వారు పేర్కొన్నారు.