పారదర్శకమైన ఓట్లతో ప్రజాస్వామ వ్యవస్థ మరింత బలోపేతం

03-10-2026 | 10:14pm

ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ శ్రీదేవి

కామారెడ్డి, అక్టోబర్ 3 (విజయక్రాంతి): పారదర్శకమైన ఓట్లతో ప్రజాస్వామ్య వ్యవస్థ(Democratic system) మరింత బలోపేతం చేయవచ్చు అని ఎలక్ట్రోల్ అబ్జర్వర్, మున్సిపల్ పరిపాలన శాఖ కార్యదర్శి శ్రీదేవి(Sridevi) అన్నారు. శనివారం కామారెడ్డి కలెక్టరేట్లో(Kamareddy Collectorate) అధికారులతో మాట్లాడారు. అర్హులైన ప్రతి పౌరుడికి ఓటు హక్కు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. పారదర్శకమైన, ఓటర్ల జాబితాను(Voter List) రూపొందించడమే అధికారుల ప్రధాన లక్ష్యమని తెలిపారు.

18 సంవత్సరాలు నిండిన ప్రతి అర్హుడిని ఓటరుగా నమోదు చేయాలని సూచించారు. ఓటర్ల నమోదు(Voter Registration), జాబితా  ప్రక్రియలో అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, పౌరులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. మరణించిన వారు, ఇతర ప్రాంతాలకు శాశ్వతంగా తరలివెళ్లిన వారి వివరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు, జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ 78 శాతం పూర్తయినట్లు అధికారులు వివరించారు.

పారదర్శకమైన, స్వచ్ఛమైన ఓటర్ల జాబితా ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ శ్రీదేవి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లు  ఎన్.వై. గిరి, విక్టర్, ఆర్డీవో ప్రభాకర్, డిప్యూటీ శిక్షణ కలెక్టర్ రవితేజ, జిల్లాలోని తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు