విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకోవాలి

09-10-2026 | 10:52pm

డిఇఓ మల్లికార్జున్ 

తాడ్వాయి,అక్టోబర్, 09( విజయక్రాంతి ): విద్యార్థులు(Students) బాగా కష్టపడి ఉన్నత స్థాయికి చేరుకోవాలని డిఇఓ మల్లికార్జున్(DEO Mallikarjun) తెలిపారు. కామారెడ్డి జిల్లా(Kamareddy District) తాడ్వాయి మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో(High School) ఆయన శుక్రవారం 9వ తరగతి జవాబు పత్రాల(Answer sheets) బాహ్య మూల్యాంకనం క్యాంపును అకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి విద్యార్థి బాగా కష్టపడి చదువుకోవాలని ఆయన సూచించారు. విద్యార్థులను ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ వారికి సూచనలు సలహాలు అందించాలని కోరారు.

క్యాంపులో హిందీ సబ్జెక్టుకు సంబంధించిన మూల్యాంకనం పరిశీలించి ఉపాధ్యాయులకు మూల్యాంకనం పై సూచనలు, సలహాలు అందించారు.అలాగే జిల్లాలోని ప్రధానోపాధ్యాయులు అందరు ఒకటవ తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థుల ఎస్ ఏ -1 మార్కులను వెంటనే ఆన్లైన్లో నమోదు చేయాలని డిఇఓ  ఆదేశించారు.ఈ సంవత్సరం పదో తరగతిలో విద్యార్థులు అందరూ మంచి మార్కులతో ఉత్తీర్ణులు అయ్యేలా తీర్చిదిద్దాలని ఉపాధ్యాయులను కోరారు.

అనంతరం ఉపాధ్యాయుల హాజరు పట్టికను, మధ్యాహ్న భోజన రిజిస్టర్ లను పరిశీలించారు. మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం అందిస్తున్నారా లేదా అనే విషయమై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి రామస్వామి తాడువాయి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు కళ్యాణి హిందీ భాష ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు