మండల స్థాయి క్రీడలలో విజేతలు వీరే..
తాడ్వాయి, నవంబర్ 01 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా(Kamareddy District) తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి ఉన్నత పాఠశాలలో మూడు రోజులుగా నిర్వహించిన మండల స్థాయి ఎస్ జి ఎఫ్ క్రీడలలో గెలుపొందిన క్రీడా జట్లకు బహుమతులు ప్రధానం చేసినట్లు పిఈటి నగేష్ తెలిపారు. కబడ్డీ క్రీడలో అండర్ 14 బాలికల విభాగంలో బ్రాహ్మణపల్లి ప్రథమ స్థానంలో తాడ్వాయి కేజీబీవీ ద్వితీయ స్థానంలో నిలిచినట్లు ఆయన తెలిపారు.
బాలుర విభాగంలో నందివాడ ప్రథమ స్థానంలో, కన్కల్ ద్వితీయ స్థానంలో, కబడ్డీ అండర్ 17 బాలికల విభాగంలో బ్రాహ్మణపల్లి ప్రథమ స్థానంలో, కరడుపల్లి ద్వితీయ స్థానంలో, బాలుర విభాగంలో బ్రాహ్మణపల్లి ప్రథమ స్థానంలో, తాడువాయి ఉన్నత పాఠశాల స్థానంలో, వాలీబాల్ క్రీడలో అండర్ 14 బాలికల విభాగంలో కరడుపల్లి ప్రథమ, ఎర్రపహాడు ద్వితీయ, బాలుర విభాగంలో మహాత్మ జ్యోతిబాపూలే ఎర్రపహాడ్ ప్రథమ, తాడువాయి ద్వితీయ, అండర్ 17 బాలికల విభాగంలో చిట్యాల ప్రథమ, కడుడుపల్లి ద్వితీయ, బాలుర విభాగంలో మహాత్మ జ్యోతిబాపూలే ఎర్ర పహాడ్ ప్రథమ, నందివాడ ద్వితీయ స్థానాల్లో నిలిచినట్లు ఆయన తెలిపారు.
ఖోఖో అండర్ 14 బాలికల భాగంలో తాడువాయి బాలికల గురుకుల పాఠశాల ప్రథమ, కన్కల్ ద్వితీయ, బాలుర భాగంలో ప్రథమ స్థానంలో రవీంద్ర భారతి తాడ్వాయి, కన్కల్ ద్వితీయ స్థానంలో, అండర్ 17 బాలికల విభాగంలో తాడువాయి గురుకుల పాఠశాల ప్రథమ,బ్రాహ్మణపల్లి ద్వితీయ,బాలుర విభాగంలో తాడువాయి ప్రథమ, నందివాడ ద్వితీయ స్థానాలు పొందాయి. క్రీడల ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వహించిన మార్చ్ పాస్ట్ లో బ్రాహ్మణ ప్రథమ, కరడుపల్లి ద్వితీయ స్థానాలు పొందినట్లు ఆయన వివరించారు. గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు, మెమొంటోలు అందించినట్లు ఆయన వివరించారు.