ఘనంగా ప్రజా పాలన దినోత్సవం

17-09-2026 | 09:42pm

తాడ్వాయి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలంలో గురువారం ప్రజాపాలన దినోత్సవం(prajapalana dinotsavam) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహాసిల్దార్ కార్యాలయం ఆవరణలో తహాసిల్దార్ శ్వేత, ఎంపీడీవో కార్యాలయం, సింగిల్ విండో కార్యాలయం(Single window office) ఆవరణలో జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు, అధికారులు మాట్లాడుతూ... ప్రజా పాలనలో ప్రజల సమస్యలు పరిష్కారం అవుతున్నాయని తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకెళ్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు