పేకాటరాయుళ్ల అరెస్టు

06-11-2026 | 08:15pm

రూ.12,800 నగదు స్వాధీనం...

తాడ్వాయి,నవంబర్,06( విజయక్రాంతి ): కామారెడ్డి జిల్లా(Kamareddy District) తాడ్వాయి మండల కేంద్రం శివారులోని దేమికలాన్ రోడ్డు పక్కన పేకాట ఆడుతున్న ముగ్గురిని పట్టుకొని అరెస్టు చేసినట్లు ఎస్సై నరేష్(SI Naresh) తెలిపారు. విశ్వసనీయ సమాచారం మేరకు శుక్రవారం దేమికలాన్ రోడ్డు పక్కన ఉన్న పత్తి చేను వద్ద డబ్బులు పందెంగా పెట్టి మూడు ముక్కల పేకాట(Three-piece poker) ఆడుతున్న ముగ్గురి పై దాడి చేసి పట్టుకున్నట్లు ఆయన తెలిపారు.

పట్టుకున్న వారిలో పులి రమేష్, బట్టు నరసింహులు, ధర్మయోళ్ల రాములు ఉన్నారన్నారు. వారి నుంచి 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు.ఈ విషయమై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన వివరించారు.ఎవరైనా మండలంలో పేకాట ఆడుతున్నట్లయితే తమకు సమాచారం అందించాలని ఆయన సూచించారు.పేకాట ఆడే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు