Breaking News

అంబేద్కర్ విగ్రహం వద్ద జనసేన పార్టీ నిరసన

09-09-2026 | 05:07pm

కరీంనగర్ సిటీ,(విజయక్రాంతి): కరీంనగర్ కోర్టు చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద జనసేన పార్టీ(Jana Sena Party)  జిల్లా నాయకులు కాస రాజు పటేల్ ఆధ్వర్యంలో జనసేన తెలంగాణ అధ్యక్షులు శంకర్ గౌడ్(Jana Sena Telangana President Shankar Goud) అరెస్టుకు నిరసనగా ప్రభుత్వంపై నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కాస రాజు పటేల్ మాట్లాడుతూ... ప్రజా సమస్యలపై ఎవరు గల మెత్తిన వారిని భయపెట్టి అరెస్టుల పర్వంకి దిగిన రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్ద దించే రోజు అతి కొద్ది రోజుల్లో ఉందని రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను వారికి గుర్తు చేస్తేనే  అరెస్టుల పర్వం కొనసాగిస్తున్నారని 22A భూములపై గాని ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలపై గాని పరిష్కారాలు చూపకుండా అరెస్టు చేస్తూ ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారని  చేతగాని ప్రభుత్వం ప్రశ్నించే గొంతును అనగదొక్కాలని చూస్తున్నారు ఇలా ఇలాంటి అరెస్టుల పర్వం  ప్రజా సమస్యలు పరిష్కరించకుండా ఇలానే కొనసాగితే జనసేన పార్టీ ఉవ్వెత్తున ఉద్యమం చేయబోతుంది అని ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు.

మరిన్ని వార్తలు