Breaking News

స్పీకర్ పై అనుచిత వ్యాఖ్యలు సిగ్గుచేటు

09-09-2026 | 05:31pm

కొమురవెల్లి దేవస్థాన మాజీ చైర్మన్ కిష్టయ్య

చేర్యాల,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్(Legislative Assembly Speaker Gaddam Prasad)పై చేసిన అనుచిత వ్యాఖ్యలను కొమురవెల్లి దేవస్థాన మాజీ చైర్మన్ ముత్యాల కిష్టయ్య(Former Chairman of Komuravelli Temple Mutyala Kishtaiah) బుధవారం తీవ్రంగా ఖండించారు. స్పీకర్ పదవికి ఎంతో గౌరవం ఉందని, ఆ పదవిని కించపరిచేలా మాట్లాడటం ప్రజాస్వామ్య విలువలను, శాసనసభ గౌరవాన్ని అవమానించడమేనన్నారు. రాజకీయ విభేదాలు సహజమే అయినా వ్యక్తిగత, అసభ్య వ్యాఖ్యలు సరికాదని, రాజ్యాంగ పదవులను గౌరవించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు పచ్చిమడ్ల సతీష్, చెవిటి లింగం, ముస్త్యాల తార యాదగిరి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు నిమ్మ శ్రీనివాస్ రెడ్డి, జనగామ నియోజకవర్గ సోషల్ మీడియా కో కన్వీనర్ తాటికొండ సదానందం, చేర్యాల పట్టణ ప్రధాన కార్యదర్శి నీలం సన్నీ, కొమ్మూరి యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు పోతురాజు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు