Breaking News

సర్పంచుల హక్కులు, గ్రామాల అభివృద్ధి కోసం కలెక్టర్ కు వినతి

09-09-2026 | 05:52pm

జనగామ,(విజయక్రాంతి): జనగాం జిల్లా(Jangaon District)లోని అన్ని గ్రామాల సర్పంచుల తరఫున గ్రామాల అభివృద్ధి, సర్పంచుల హక్కులు, గ్రామ పంచాయతీల సమస్యల(Gram Panchayat issues) పరిష్కారం కోసం బుధవారం రోజున జిల్లా కలెక్టర్(Collector) కి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షులు గోపగోని శ్రీధర్ గౌడ్ మాట్లాడుతూ.. గ్రామ ప్రజలకు అత్యంత దగ్గరగా పనిచేసే ప్రజాప్రతినిధులు సర్పంచులేనన్నారు. గ్రామంలో ఏ సమస్య వచ్చినా ప్రజలు ముందుగా సర్పంచులను ఆశ్రయిస్తారు.

అయితే సర్పంచులకు సరైన అధికారాలు, నిధులు, విధుల్లో తగిన ప్రాధాన్యత లేకపోవడం వల్ల అభివృద్ధి పనులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. గ్రామ పంచాయతీలకు అవసరమైన నిధులు విడుదల చేయాలని, సర్పంచులకు రావాల్సిన హక్కులు కల్పించాలని, గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలని కలెక్టర్ ను కోరామని తెలిపారు. ఇది ఒక్క సర్పంచ్ సమస్య కాదు, ఒక్క గ్రామ సమస్య కాదు, జనగాం జిల్లా సర్పంచులందరి సమస్య అని స్పష్టం చేశారు. హక్కుల సాధన కోసం, గ్రామాల అభివృద్ధి కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో ఐక్యంగా పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.

మరిన్ని వార్తలు