నేడు సుల్తానాబాద్ ప్రీమియర్ లీగ్ ప్రారంభం

09-10-2026 | 11:08pm
  1. హాజరుకానున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే విజయ రమణారావు
  2. ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాట్లు పూర్తి

సుల్తానాబాద్, అక్టోబరు 09 (విజయక్రాంతి): యువతలో క్రీడాస్ఫూర్తిని(Sportsmanship) పెంపొందించడంతోపాటు క్రికెట్‌ క్రీడాకారులను(Cricket players) ప్రోత్సహించేందుకు సుల్తానాబాద్ ప్రీమియర్ లీగ్(Sultanabad Premier League) (ఎస్‌పీఎల్‌) సీజన్‌–2కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈనెల 10న శనివారం పెద్దపల్లి జిల్లా(Peddapalli District) సుల్తానాబాద్‌ జూనియర్‌ కళాశాల మైదానంలో లీగ్‌ ప్రారంభోత్సవం నిర్వహించనున్నారు. మున్సిపల్‌ పరిధిలోని ఆరో వార్డు కౌన్సిలర్‌ బాకం సాయికిరణ్‌ తన సొంత ఖర్చులతో యువత కోసం మరో ముందడుగు వేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

విజేతలకు ప్రథమ బహుమతిగా రూ.లక్ష, ద్వితీయ బహుమతిగా రూ.50 వేల నగదు అందించనున్నారు. ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా పెద్దపల్లి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చింతకుంట విజయ రమణారావు(Vijaya Ramanarao) హాజరై పోటీలను లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి మండలంలోని సర్పంచులు ప్రజాప్రతినిధులు, మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డుల కౌన్సిలర్లు హాజరు కావాలని నిర్వాహకులు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌పీఎల్‌ ఆర్గనైజర్లు సందీప్‌, తోపాటుతదితరులున్నారు.

మరిన్ని వార్తలు