విశ్వభారతి హైస్కూల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

09-10-2026 | 11:11pm

అక్టోబర్ 9: మూసాపేట్ మండల(Moosapet Mandal) పరిధిలోని జానంపేట విశ్వభారతి హైస్కూల్(Viswabharati High School),  శుక్రవారం బతుకమ్మ సంబరాలను(Bathukamma celebrations) ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినులు(Female students) సంప్రదాయ దుస్తులు ధరించి, రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా అలంకరించారు. పాఠశాల ప్రాంగణంలో బతుకమ్మలను ఏర్పాటు చేసి, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఆటపాటలతో ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు, పూల పండుగ బతుకమ్మ విశిష్టత గురించి వివరించారు.

విద్యార్థుల సందడి, సంప్రదాయ నృత్యాలు, బతుకమ్మ పాటలతో పాఠశాల ప్రాంగణం పండుగ శోభను సంతరించుకుంది.ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడమే ఇటువంటి వేడుకల ముఖ్య ఉద్దేశమని పాఠశాల యాజమాన్యం తెలిపింది.

మరిన్ని వార్తలు