కాళేశ్వరం జలాలతోనే పరిష్కారం

25-10-2026 | 05:15am
  1. హైదరాబాద్ నీటి కష్టాలు తీరుతాయి
  2. కన్నెపల్లి నుంచి వెంటనే గోదావరి నీటిని ఎత్తిపోయాలి
  3. నగర ప్రజలను ఆదుకోవాలి
  4. లేదంటే ప్రజలతో కలిసి సీఎం ఇంటిని ముట్టడిస్తాం
  5. కన్నెపల్లి పంప్‌హౌస్ సందర్శనలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల హెచ్చరిక

భూపాలపల్లి/కాళేశ్వరం, అక్టోబర్ 24 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో తాగునీటి సంక్షోభాన్ని నివారించేందుకు కన్నెపల్లి పం ప్‌హౌస్ నుంచి వెంటనే గోదావరి జలాలను(Godavari Water) ఎత్తిపోసి నగర ప్రజలకు నీటిని అందించాలని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని(Government) డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోకపోతే ప్రజలతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరిం చారు.

శనివారం కన్నెపల్లి పంప్‌హౌస్‌ను ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, కెపి వివేకానందగౌడ్, మర్రి రా జశేఖర్‌రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, మాజీ మం త్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. గోదావరి జలాలు భారీగా దిగువకు ప్రవహిస్తూ సముద్రంలో కలుస్తున్నా, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు వినియోగించుకోవడంలో ప్ర భుత్వం విఫలమవుతోందని ఆరోపించారు.

జూన్ నుంచి ఇప్పటివరకు సుమారు 750 టీఎంసీలకు పైగా గోదావరి జలాలు సముద్రంలో కలిశాయని, కనీసం 250 టీఎంసీల నీటిని ఎత్తిపోసినా జలాశయాలు, చెరువుల్లో నీటి నిల్వలు పెరిగేవని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో పలు ప్రాంతాలకు మూడు రోజుల కు ఒకసారి కూడా సక్రమంగా నీరు రావడం లేదని, తక్కువ ఫీడనంతో సరఫరా అవుతోందని తెలిపారు. వాటర్ ట్యాంకర్లకు డిమాండ్ పెరిగిందని, నగరంలో నీటి కొరత తీవ్రతకు ఇది నిదర్శనమన్నారు.

మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. కనీసం ఇప్పటికైనా కన్నెపల్లి నుంచి గోదావరి జలాలను ఎత్తిపోసి ప్రజల నీటి కష్టాలు తీర్చాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వివేకానందగౌడ్ మాట్లాడుతూ.. భవిష్యత్‌లో  నీటి సమస్యపై గతంలోనే ప్రభుత్వాన్ని హెచ్చరించినా పట్టించుకోలేదని ఆరోపించారు.

ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. విలువైన గోదావరి జలాలు సముద్రంలో కలు స్తుండగా హైదరాబాద్ తాగునీటి సంభం దిశగా వెళ్లడం ఆందోళనకరమని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటర మణారెడ్డి అన్నారు. వెంటనే కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోసి నగర ప్రజలకు తాగునీటి భరోసా కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.


మరిన్ని వార్తలు