నాగిరెడ్డిపేట మండలంలో ప్రజా పాలన దినోత్సవం
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని తాండూరు, మాటూర్, మాసంపల్లి, అక్కంపల్లి, వెంకంపల్లి, ఆత్మకూర్, జలాల్పూర్ గ్రామాలతో పాటు అన్ని గ్రామాల్లో గ్రామపంచాయతీ కార్యాలయాల్లో మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయం వద్ద తాండూర్, మాల్తుమ్మెద సొసైటీ కార్యాలయం(Maltummeda Society Office) వద్ద తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం(Telangana prajapalana dinotsavam) కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జాతీయ జండా ఆవిష్కరణ చేయడం జరిగింది.
సెప్టెంబర్ 17వ తేదీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవంగా ప్రకటించిన సందర్భంగా జెండా ఆవిష్కరించడం జరిగింది. 1948 సెప్టెంబర్ 17న అప్పటి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో (ఇండియన్ యూనియన్) విలీనమైంది. నిజాం నిరంకుశ పాలన,రజాకార్ల దౌర్జన్యాల నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించిన ఈ చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ దినోత్సవాన్ని జరుపుతోంది. ఈ కార్యక్రమంలో సర్పంచులు, సొసైటీ చైర్మన్లు,సీఈవోలు డైరెక్టర్లు,ఉపసర్పంచులు, కార్యదర్శులు,వార్డ్ మెంబర్లు,గ్రామస్తులు పాల్గొన్నారు.