కాంగ్రెస్ మాజీ కౌన్సిలర్ సతీమణి మృతి

22-10-2026 | 07:50pm

కరీంనగర్ సిటీ అక్టోబర్ 22(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్(Former Congress party councilor) దివంగత సయ్యద్ హఫీజుద్దీన్ అలియాస్ హాఫిజ్ భాయి సతీమణి (శా సాహబ్ మొహాళ్ల) అఫ్జలున్నిసా బేగం (90) అనారోగ్యానికి గురై బుధవారం రాత్రి మరణించారు. ఖాద్రీ ఖాందాన్ లో మంచికి మారుపేరుగా అఫ్జలున్నిసా నిలిచారని, మంచి కుటుంబ నేపథ్యంతో ముందడుగు వేశారని అఫ్జలున్నిసా సేవలను, కుటుంబ సభ్యులు, ఆమె కుటుంబ శ్రేయోభిలాషులు గుర్తు చేసుకున్నారు.

అఫ్జలున్నిసా మృతి పట్ల ఆమె కుమారుడు ఎంఐఎం సీనియర్ నేత, సున్నీ మర్కజీ మిలాద్ కమిటీ అధ్యక్షుడు హాఫిజ్ సయ్యద్ మొయిజుద్దీన్ ఖాద్రీ యూసుఫ్ ను, ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపి బారిష్టర్ అసదుద్దీన్ ఓవైసీ ఫోన్ ద్వారా మాట్లాడారు. ఆమె మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.

రాష్ట్ర మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మాజీ ఎంపీ వినోద్ కుమార్, కాంగ్రెస్ నేత వెలిచాల రాజేందర్ రావు, బిఆర్ఎస్ నేత చలిమేడ లక్ష్మీ నర్సింహరావు, గాంధీ పేపర్ క్రాఫ్ట్ రఘునందన్ రావు, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, మాజిద్ హుస్సేన్, జాఫర్ హుస్సేన్ మేరాజ్, ముబీన్, మీర్ జుల్ఫీఖార్ అలీ, ఎంఐఎం జిల్లా ఇంచార్జి యాసర్ అర్ఫాత్, 

ఎమ్మెల్సీ రియజుల్ హసన్ ఎఫెయిండి, కరీంనగర్ పోలీసు కమిషనర్ గౌష్ ఆలం, సుడా మాజీ చైర్మన్ నరేందర్ రెడ్డి, డిప్యూటీ మేయర్ సునీల్ రావు, వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ మసిఉల్లాహ్ ఖాన్, మహమ్మద్ సలీం, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ లు ఇంతియాజ్ ఇస్ హాఖ్, సయ్యద్ అక్బర్ హుస్సేన్ తదితరులు సంతాపం తెలిపారు.

ఎంఐఎం కరీంనగర్ జిల్లా ఉమ్మడి అధ్యక్షుడు సయ్యద్ గులాం అహ్మద్ హుస్సేన్, జమియతుల్ ఉలేమా జిల్లా ఉపాధ్యక్షుడు ముఫ్తి ఘియాస్ మొహియుద్దీన్, హాఫిజ్ షఫీయుద్దీన్ ఏజాస్ ఇమాం అస్లామి మస్జిద్, సదర్ ఖాజి హాఫిజ్ మంఖబత్ శాఖాన్, హాఫిజ్ వసిముద్దీన్, హాఫిజ్ సోహైల్ బిన్ అబ్దుల్లా, లారీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సాజిద్,  అహిళే సున్నత్ వల్ జమాత్ మౌలాన ఖయ్యుమ్ జియాయి,

మౌలానా అలిమోద్దీన్ నిజామీ, మౌలానా అబుల్ కలాం మిస్బాహి, అబ్దుల్ కరీం జాహిద్, జమియతుల్ హుఫ్ఫాజ్ కార్యదర్శి హాఫిజ్ జియాఉల్లాహ్ ఖాన్, కరిముల్లాహ్ శాసాహబ్ దర్గాహ్ ముతవల్లి మన్సూర్ సులేమాన్ తవక్కలి, జమాతే ఇస్లామీ జిల్లా అధ్యక్షుడు సోహైబ్ అహ్మద్ ఖాన్, ఖైరోద్దీన్, తబలీగ్ జమాత్ ప్రతినిధులు రహీం మాము,

ఆబిద్, జమియత్ అహిలే హదిస్ జిల్లా అధ్యక్షుడు అబ్దుల్ సమి, నూర్ బాషా జేఏసీ చైర్మన్ అహ్మద్ మొహియుద్దీన్ బాబుజానీ, బిఆర్ఎస్, ఎంఐఎం, కాంగ్రెస్ పార్టీల కార్పొరేటర్లు, అన్ని జమాత్ లకు చెందిన ముస్లిం సోదరులు, అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ముస్లిం నాయకులు, కరీంనగర్ పురాతన జామా మస్జిద్ లో జుహార్ నమాజ్ అనంతరం నిర్వహించిన నమాజే జనాజాకు వందలాదిమంది హాజరై దుఆ చేశారు. తకియ మొహాళ్ల ఖబ్రస్థాన్ లో అంత్యక్రియలు పూర్తి చేశారు. కుల, మతాలకు అతీతంగా పెద్ద ఎత్తున హిందూ సోదరులు తరలివచ్చి హాఫీజ్ యూసుఫ్ ను పరామర్శించారు.

మరిన్ని వార్తలు