అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి జిల్లా పెరిక కుల సంఘం అండ

22-10-2026 | 10:40pm

రాష్ట్ర పెరిక కార్పొరేషన్ చైర్మన్ వెంకటేశ్వర్లు

బాధుతునికి రూ.62,500 ఆర్థిక సాయం అందజేత

సూర్యాపేట,(విజయక్రాంతి): అగ్నిప్రమాదం(Fire accident)లో కిరాణా దుకాణం పూర్తిగా కాలిపోయి తీవ్ర ఆర్థిక నష్టానికి గురైన సూర్యాపేట(Suryapet)కు చెందిన పెరిక కులబంధువు యర్రంశెట్టి ఉపేందర్ దంపతులకు పెరిక కుల సంఘం అండగా ఉంటుందని తెలంగాణ రాష్ట్ర పెరిక కుల కార్పొరేషన్(Perika Caste Corporation) చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు అన్నారు. గురువారం బాధితున్ని పరామర్శించిన అనంతరం కుల సంఘ నాయకులతో కలిసి రూ.62,500 ఆర్థిక సహాయం అందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్నిప్రమాదంలో దుకాణం నష్టపోవడం బాధాకరమైన విషయమన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరంగా నష్టపరిహారం అందించే అవకాశం ఉంటే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, పరిహారం అందేలా తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం కుల సమాజంలోని ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. తదుపరి ఆర్థిక సాయం అందించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు బందు శ్రీధర్ బాబు, కోదాడ పెరిక హాస్టల్ అధ్యక్షుడు హసనాబాద రాజేష్, జిల్లా గౌరవ అధ్యక్షుడు రామినేని సత్యనారాయణ, జిల్లా అసోసియేట్ అధ్యక్షుడు దొంగరి నాగేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి పాయిలి వెంకటనారాయణ,  రాందేని ఆదినారాయణ,జిల్లా నాయకులు ప్రముఖ రియల్టర్ యర్రంశెట్టి ఉపేందర్, పట్టణ ప్రధాన కార్యదర్శి పోతురాజు నరసయ్య తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు