అసంపూర్తి పాఠశాల భవన నిర్మాణం పూర్తి చేయండి

09-10-2026 | 11:25pm
  1. విద్యార్ధుల భవిష్యత్ కాపాడండి
  2. టీ డబ్ల్యు యం ఎఫ్ జిల్లా ఇంచార్జీ గుండా ఉపేందర్ రెడ్డి 

కూసుమంచి, అక్టోబర్ 9(విజయక్రాంతి): కూసుమంచిలోని(Kusumanchi) స్కూల్ అసంపూర్తి పాఠశాల భవన నిర్మాణం(Construction of the school building) పూర్తి చేయాలని, విద్యార్ధుల భవిష్యత్(Students' Future) కాపాడాలని, 8వ వార్డు సభ్యుడు, వార్డు మెంబర్స్ అసోసియేషన్(Ward Members Association) అధ్యక్షుడు గుండా ఉపేందర్ రెడ్డి(Gunda Upender Reddy) డీఈఓ వాసంతిని కోరారు. శుక్రవారం ఖమ్మం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా విద్యాశాఖ అధికారిణి డి.వాసంతి ని   మర్యాదపూర్వకంగా కలిసిన ఆయన కూసుమంచి ఎస్సీ కాలనీ ప్రాథమిక పాఠశాల భవన నిర్మాణం అసంపూర్తిగా ఉండటం వలన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు వివరించారు. 

అని ప్రాథమిక పాఠశాలలోఉన్న మూడు గదులలో, మొత్తం 124 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ, ప్రీ ప్రైమరీ తరగతి విద్యార్థులకు ఒక గది కేటాయించ గా మిగిలిన రెండు గదులలో మాత్రమే విద్యాభ్యాసం కొనసాగిస్తున్నారని తెలిపారు.  ఆమె స్పందిస్తూ తక్షణమే కోఆర్డినేటర్ పాఠశాల సందర్శించి ,పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగినది

మరిన్ని వార్తలు