ఎస్ఐఆర్ పేరుతో ఓట్ల తొలగింపు

24-09-2026 | 03:22pm
  1. 👉🏻ఈసీ బీజేపీకి తొత్తుగా మారింది
  2. 👉🏻జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ ఫైర్
  3. 👉🏻ఎన్నికల కమిషన్ తీరుపై ఘాటు విమర్శలు
  4. 👉🏻జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్

ఖమ్మం, సెప్టెంబర్ 24(విజయక్రాంతి): కేంద్ర ఎన్నికల సంఘం ఎస్ఐఆర్(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)(Special Intensive Revision) పేరుతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్, ప్రతిపక్ష పార్టీల ఓట్లను లక్ష్యంగా చేసుకుని తొలగిస్తోందని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్(Congress President Nuthi Satyanarayana Goud) ఘాటుగా విమర్శించారు. శుక్రవారం ఆయన స్థానికంగా మాట్లాడుతూ...ఈసీ తాజాగా సుప్రీంకోర్టులో వేసిన అఫిడవిట్ పూర్తిగా అసమంజసంగా ఉందన్నారు. "అనుమానాలను స్వీకరించం, ఆ అంశాన్ని కమిషన్ పరిశీలిస్తుంది అని క్యాబినెట్ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లామని సమాధానం చెప్పడం సిగ్గుచేటు.

10 ఏళ్లలో 14 సార్లు ఇద్దరు ఎన్నికల కమిషనర్లు ఇలా చట్టవిరుద్ధంగా చర్యలు చేపట్టారని వారిలో ఆరోపించారు. 2025 జూన్ నుండి ఇప్పటిదాకా సర్ లో భాగంగా 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 13 కోట్లకు పైగా ఓట్లను తొలగించారు. ఇది ఓట్ల తొలగింపు కాదు, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే" అని ఆయన మండిపడ్డారు. ఈసీ తీరుపై దేశవ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తమవుతోందని, అందుకే ఢిల్లీలో యువజన కాంగ్రెస్ కార్యకర్తలు సీఈసీ జ్ఞానేష్ కుమార్ కు వ్యతిరేకంగా నిరసన తెలిపారని గుర్తుచేశారు.

బీజేపీతో కలిసి ఓట్ల చోరీకి కుట్ర:

"బీజేపీ, ఆరెస్సెస్, ఈసీలు కలిసి ఓట్ల చోరీ ద్వారా దేశద్రోహ చర్యకు పాల్పడుతున్నాయి. బీహార్, మహారాష్ట్ర, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ లో నిరసనలు చిన ఆసాంతం ఎన్నికలను రద్దు చేసి మళ్ళీ బ్యాలెట్ పేపర్ తో ఎన్నికలు నిర్వహించాలి. సీఈసీ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి, ఆయనను అరెస్టు చేయాలి. గతేదాది కాలంలో ఈ నిర్ణయాలను పూర్తి కమిషన్ ఏకగ్రీవంగా తీసుకోలేదు, కేవలం కొందరు అధికారుల ఇష్టానుసారంగా జరుగుతోంది" అని ఆయన ఆరోపించారు.

కొత్త ఓటరు అంటే ఎవరో తెలియదని, తల్లిదండ్రులు, తాతల పేర్లను నింపడానికి తీసుకొచ్చిన పారంఫారం మార్పులు చేయడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, చట్టాల్లో మార్పులు చేయకుండా ఫారం -6 ను మార్చలేరని అన్నారు. 

ఈసీ తీరు బ్రిటిష్ పాలనను తలపిస్తోందని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ వీధి పోరాటం చేస్తుందని, దేశ ప్రజలు ఎప్పుడో బీ జె పి పార్టీని అభిశంసించారని, ఈ పోరాటం ఆగదని జిల్లా కాంగ్రెస్ కమిటి అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు