జీవన జ్యోతి భీమా యోజనతో కుటుంబానికి ఆర్థిక భరోసా
రూ.2 లక్షల బీమా క్లెయిమ్ చెక్ అందజేసిన తెలంగాణ గ్రామీణ బ్యాంక్
వీర్నపల్లి, సెప్టెంబర్ 24 విజయక్రాంతి : ప్రధానమంత్రి జీవన జ్యోతి భీమా యోజన (PMJJBY)(Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana) పథకం ఆపదలో ఉన్న కుటుంబాలకు ఆర్థిక భరోసాగా నిలుస్తోందని తెలంగాణ గ్రామీణ బ్యాంక్ వీర్నపల్లి శాఖ మేనేజర్ ముదం సంతోష్ పేర్కొన్నారు.వీర్నపల్లి మండలం రషీగుట్ట తండాకు చెందిన గుగులోత్ లింగం ఇటీవల మృతి చెందగా, ఆయన పేరుతో ఉన్న ప్రధానమంత్రి జీవన జ్యోతి భీమా యోజనలో భాగంగా మంజూరైన రూ.2 లక్షల బీమా క్లెయిమ్ మొత్తానికి సంబంధించిన చెక్కును నామినీ గుగులోత్ లావణ్యకు తెలంగాణ గ్రామీణ బ్యాంక్ వీర్నపల్లి బ్రాంచ్ మేనేజర్ ముదం సంతోష్ అందజేశారు.
ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ, తక్కువ ప్రీమియంతో అందుబాటులో ఉన్న ప్రధానమంత్రి జీవన జ్యోతి భీమా యోజన వంటి బీమా పథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కుటుంబ పెద్దను కోల్పోయిన సమయంలో బీమా మొత్తం కుటుంబానికి కొంతమేర ఆర్థిక సహాయాన్ని అందిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఫీల్డ్ ఆఫీసర్ సురేష్, క్యాషియర్ అరుణ్, అటెండర్ షేకిల్ పాల్గొన్నారు.