మద్దిశెట్టి సామేలు నివాసంలో సినీ ప్రముఖులు

12-10-2026 | 04:15pm

రియల్ స్టార్ హీరో అప్సర్ ఆజాద్, ప్రముఖ దర్శకులు జితేంద్ర యాదగిరి రాక

సత్తుపల్లి,(విజయక్రాంతి): త్వరలో తెరకెక్కనున్న నూతన చిత్రం లొకేషన్ల పరిశీలనలో భాగంగా మద్దిశెట్టి సామేలు  నివాసానికి సినీ ప్రముఖుల రాక. ఈరోజు మద్దిశెట్టి సామేలు  నివాసానికి ప్రముఖ సినీ హీరో రియల్ స్టార్ అప్సర్ ఆజాద్ గారు, ప్రముఖ దర్శకులు జితేంద్ర యాదగిరి  తమిళనాడు రాష్ట్రానికి చెందిన చిన్నదోర స్వామీజీ విచ్చేశారు. త్వరలో తెరకెక్కనున్న నూతన చిత్రానికి సంబంధించిన షూటింగ్ లొకేషన్ల పరిశీలన కోసం హీరో అప్సర్ ఆజాద్ , దర్శకులు జితేంద్ర యాదగిరి చిన్నదోర స్వామీజీ  మద్దిశెట్టి సామేలు  నివాసానికి చేరుకున్నారు.

ఈ సినిమాలో మద్దిశెట్టి సామేలు  కూడా కీలక పాత్రలో నటించనున్నారు. ముఖ్యంగా రియల్ స్టార్ హీరో అప్సర్ ఆజాద్ కి తమ్ముడి పాత్రలో మద్దిశెట్టి సామేలు  కనిపించనున్నారు. ఈ సందర్భంగా త్వరలో ప్రారంభం కానున్న సినిమా చిత్రీకరణకు సంబంధించిన లొకేషన్లు, ఇతర అంశాలపై చర్చించారు. సినీ ప్రముఖులు మద్దిశెట్టి సామేలు  నివాసానికి రావడంతో అక్కడ సందడి నెలకొంది. త్వరలో ఈ చిత్రం షూటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది.

మరిన్ని వార్తలు