గత సంవత్సరం కంటే పెరిగిన కోట మైసమ్మ తల్లి జాతర ఆదాయం..
సింగరేణి అక్టోబర్ 26 (విజయక్రాంతి): సింగరేణి మండలం ఉసిరికాయలపల్లి గ్రామంలో కొలువుదిరిన శ్రీ కోట మైసమ్మ తల్లి జాతర(Kota Maisamma Jathara) మహోత్సవ సందర్భంగా వచ్చిన హుండీ ఆదాయాన్ని ఆలయ ట్రస్ట్ చైర్మన్ పర్సా పట్టాభి రామారావు దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ ఆర్ సమత, ఈవో కె వెంకటయ్య ఆధ్వర్యంలో లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కోట మైసమ్మ తల్లి జాతర ఆదాయం 32 లక్షల 2 వేల 697రూపాయల ఆదాయం వచ్చినట్లు, గత సంవత్సరం కంటే సుమారు 3 లక్షల రూపాయల ఆదాయం పెరిగినట్లు వారు తెలిపారు. అలాగే జాతర నిర్వహణకు సహకరించిన వివిధ శాఖల అధికారులకు ప్రజాప్రతినిధులకు గ్రామస్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పరస సాయి, పగడాల మోహన్ కృష్ణ, పూజారి కొత్తలంక కైలాష్ శర్మ ఉసిరికాయల పల్లి పంచాయతీ కార్యదర్శి నిరంజన్ తదితరులు పాల్గొన్నారు.