ఎస్సై , డ్రైవర్‌ను పరామర్శించిన పోలీస్ కమిషనర్

24-09-2026 | 03:18pm

ఖమ్మం, తిరుమలాయపాలెం,  సెప్టెంబర్ 24(విజయక్రాంతి): రాత్రి పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న పోలీస్ వాహనాన్ని(Police vehicle) లారీ ఢీకొన్న ఘటనలో ఎస్సైతో పాటు పోలీస్ వాహన డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందుకున్న  పోలీస్ అధికారులు తిరుమలాయపాలెం ఎస్సై కూచిపూడి జగదీశ్(Thirumalayapalem SI Kuchipudi Jagadish)  కొత్తపల్లి రాకేష్ లను పరిశీలించారు. రాజేష్ పరిస్థితి మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించారు.

విషయం తెలుసుకున్న పోలీస్ కమిషనర్ సునీల్ దత్ రాత్రి ఆసుపత్రికి చేరుకుని గాయపడిన ఎస్సై, డ్రైవర్‌ను పరామర్శించారు.  వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. అనంతరం రాకేష్ కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా నిరంతరం పరిస్థితిని పర్యవేక్షించాలని పోలీస్ అధికారులకు ఆదేశించారు. 

విధినిర్వహణ లో భాగంగా రాత్రి పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకోవడం పట్ల పోలీస్ కమిషనర్ విచారం వ్యక్తం చేశారు. గాయపడిన సిబ్బంది త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు..

మరిన్ని వార్తలు