సేవా భావంతో బీజేపీ కార్యకర్తల ప్రధమ కర్తవ్యం

09-10-2026 | 11:29pm

పాలేరు అసెంబ్లీ ఇంచార్జ్ నున్నా రవికుమార్

నేలకొండపల్లి, అక్టోబర్ 9 విజయక్రాంతి: సేవా సంకల్ప అభియాన్ కార్యక్రమంలో(Seva Sankalp Abhiyan Program) భాగంగా శుక్రవారం కిసాన్ మోర్చా(Kisan Morcha) ఆధ్వర్యంలో పాలేరు నియోజకవర్గం నేలకొండపల్లి మండలం మోటపురం, నాచేపల్లి గ్రామాలలో  పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు.  కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు నరుకుల వెంకటేశ్వరరావు(Narukula Venkateswara Rao) అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాలేరు ఇంచార్జ్ నున్నా రవికుమార్ (Nunna Ravikumar)పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మోటపురం, నాచేపల్లి లోని అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడీ టీచర్లకు ఆయా లకు ఆ గ్రామంలోని ఆశా వర్కర్లకు నరేంద్ర మోడీ  25 సంవత్సరాల సుపరిపాలన సందర్భంగా గ్రామాల్లో సేవ చేస్తున్న  కార్యకర్తలకు నరేంద్ర మోడీ  ప్రతినిధులు గా వారిని సన్మానించారు. వ్యవసాయ క్షేత్రంలో రైతులతో సమావేశం నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల నాగేందర్, రాష్ట్ర నాయకులు మందడపు సుబ్బారావు, జిల్లా నాయకులు నాగ సురేందర్ రెడ్డి, కోటి హనుమంతరావు, ఆపతి రామారావు, మండేపూడి నాగేశ్వరరావు, బెల్లం మురళి,  నాయకులు, స్థానిక రైతులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు