కుమరం సూరుకు ఘన నివాళి

29-10-2026 | 07:28pm

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఆదిమ గిరిజన పోరాట యోధుడు కుమరం సూరు(Kumaram Suru, a tribal freedom fighter) వర్ధంతిని గురువారం ఆసిఫాబాద్‌లోని రవిచంద్ర కాలనీలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ జాదవ్ అంబాజీ, కుమరం సూరు విగ్రహానికి పూజలు చేసి నివాళులర్పించారు.

కోలం గిరిజనుల హక్కుల పరిరక్షణ, విద్యాభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుకు శాఖ తరఫున సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ టెకం గంగారాం, కోలం సంఘం జిల్లా అధ్యక్షుడు ఆత్రం తిరుపతి, కుమరం సూరు మనవడు కుమరం పాండు, ఆత్రం భీంరావ్, మాడావి శ్రీనివాస్, పెందూర్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు