ఫోక్సో చట్టంపైన అవగాహన ఉండాలి
బోథ్,(విజయక్రాంతి): ఫోక్సో చట్టం(POCSO Act Awareness)పైన విద్యార్థులకు అవగాహన కలిగి ఉండాలని బోత్ మున్సిపల్ మెజిస్ట్రేట్ కంభం సందీప్ పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రంలోని బాలికల పాఠశాలలో విద్యార్థులకు జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... లైంగిక వేధింపులు(Sexual harassment) బాలల హక్కులు బాలికల రక్షణ చట్టం ప్రాముఖ్యత గురించి వివరించారు.
మంచి స్పర్శ చెడు స్పర్శ మధ్య తేడాల గురించి అవగాహన కలిగించారు. పిల్లలు తమపై జరిగే అనుచిత ప్రవర్తనను గుర్తించి భయపడకుండా నమ్మకమైన పెద్దలకు ఉపాధ్యాయులకు చెప్పాలని సూచించారు. విద్యార్థులకు ఈ సందర్భంగా టోల్ ఫ్రీ నెంబర్ కు సంబంధించిన గోడ పత్రికలను విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో న్యాయవాది ఏజీపీ పంద్రం శంకర్,, న్యాయవాది కుమ్మరి విజయకుమార్, మహిళా పిసి లైలా, అంబాజీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.