కొండా సారీపై.. కేటీఆర్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌!

29-10-2026 | 05:35pm

కొండా సురేఖ (Konda Surekha) క్షమాపణల వ్యవహారంపై బీఆర్ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఘాటుగా స్పందించారు. తమపై తప్పుడు ఆరోపణలు (False Allegations) చేస్తున్నవారు భవిష్యత్తులో వరుసగా క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు. నిజం ఎప్పటికైనా బయటపడుతుందని స్పష్టం చేశారు.

“నిజం నిలకడ మీదే తేలుతుంది. మొన్న ఒక వార్తాపత్రిక క్షమాపణ చెప్పింది.. ఈరోజు ఈ మేడం చెప్పారు. ఇంకా క్షమాపణలు చెప్పేవాళ్లు చాలామంది ముందు వరుసలో ఉన్నారు. మాపై ఇప్పుడు తప్పుడు ఆరోపణలు చేస్తున్నవారు భవిష్యత్తులో వరుసగా క్షమాపణలు చెబుతారు” అంటూ కేటీఆర్ వ్యాఖ్యానించారు.

తమపై ఆరోపణలు చేస్తున్నవారికి కాలమే సమాధానం చెబుతుందనే ధోరణిలో కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా (Political) ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కొండా సురేఖ క్షమాపణల నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి

మరిన్ని వార్తలు