వైభవంగా శ్రీ సమర్థసాయి గణేష్ అన్నదానం

24-09-2026 | 08:18pm

ఆసిఫాబాద్, సెప్టెంబర్24( విజయ క్రాంతి): పట్టణంలోని బజార్‌వాడి హనుమాన్ టెంపుల్ ఆవరణలోని శ్రీ సమర్థసాయి గణేష్ మండలి(Sri Samartha Sai Ganesh Mandali) వద్ద గురువారం మహా అన్నదాన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మున్సిపల్ చైర్‌పర్సన్ ఆకాష్, వైస్ చైర్‌పర్సన్ ఎండీ అహ్మద్‌లను శాలువాలతో సత్కరించారు.

ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ ఎండీ అహ్మద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ అలీ బీన్ అహ్మద్, మున్సిపల్ కమిషనర్ అంజయ్య, కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్ సరస్వతి, కోవ లక్ష్మి ఫౌండేషన్ చైర్మన్ కోవ సాయినాథ్, బీఆర్‌ఎస్ నాయకులు, గణేష్ మండలి నిర్వాహకులు, భక్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు