గ్రామాలలో సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలి

06-11-2026 | 08:04pm

బెజ్జూర్ నవంబర్ 06, (విజయక్రాంతి): గ్రామాలలో సమస్యలపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని బెజ్జూరు మండల(Bejjur Mandal) ప్రత్యేక అధికారి నదీమ్  తెలిపారు. శుక్రవారం బెజ్జూరు మండల కేంద్రంలోని రైతు వేదికలో మండల పరిషత్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా మండల ప్రత్యేక అధికారి  నదీమ్(Mandal Special Officer Nadeem)  మాట్లాడుతూ ప్రభుత్వం విజిరామ్ పథకం(Government VG-ram Scheme) ద్వారా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుందని, కరువు పరిస్థితులను ఎదుర్కునేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

బెజ్జూరు మండలంలోని పాపన్నపేట, లంబడి గూడ, అంబగట్ట గ్రామాల్లో మూడో విద్యుత్ లైన్ ఏర్పాటు చేయాలని సర్పంచులు అనసూర్య, ధరావత్ కవిత, నగేష్ లు సభా దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయమై ఉన్నతాధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని బెజ్జూర్ లైన్ ఇన్స్పెక్టర్ ధర్మయ్య సమాధానం ఇచ్చారు. బెజ్జూరు మండలంలో 534 4 మందికి ఉచితంగా విద్యుత్ అందిస్తున్నట్లు తెలిపారు. అర్హులైన వారు దరఖాస్తు చేసుకుంటే మరింత సౌకర్యం కల్పిస్తామని తెలిపారు.

మండలంలో అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందజేస్తామని తాసిల్దార్ రామ్మోహన్రావు తెలిపారు. మండలంలో 9444  మందికి ఉచితంగా బియ్యం అందజేస్తున్నట్లు తెలిపారు. రేషన్ కార్డుల ప్రక్రియ నిరంతర ప్రక్రియ అని తెలిపారు. అర్హులైన వారు ఉంటే మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మండలంలోని గిరిజన  పాఠశాలలపై పర్యవేక్షణ కొరవడిందని సులుగు పళ్లి సర్పంచ్ సోయం చిన్నయ్య  ఆరోపించారు.

ఐటిడిఏ  అధికారులు సమావేశాలకు గైహాజరవుతున్నారని మండల సమావేశాలకు తప్పనిసరిగా హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని మండల ప్రత్యేక అధికారి నదీమ్ ఎంపీడీవోను ఆదేశించారు.  మండలంలో 524 ఇందిరమ్మ గృహాలు మొదటి విడుదల మంజూరయ్యాయని, 46 ఇందిరమ్మ గృహాలు కంప్లీట్ అయ్యాయని, మిగతా వివిధ దశల్లో ఉన్నట్లు తెలిపారు. దీపావళి సందర్భంగా మా ఇందిరమ్మ దీపావళి కార్యక్రమాన్ని నిర్వహించాలని గృహ నిర్మాణ శాఖ ఇంజనీర్ సాయికుమార్ తెలిపారు.

బెజ్జూరు మండలంలో శనిగ విత్తనాలు అందుబాటులో ఉన్నాయని వ్యవసాయ అధికారి నాగరాజు తెలిపారు మండలంలో కపాస్ క్రాంతి పథకం ద్వారా 5485 మంది రైతులకు పత్తి విత్తనాలు, మందులు. అందజేసినట్లు తెలిపారు.  మండలంలోని పాపన్నపేట బుజాడివాడ పాఠశాలలో బోరు వేసే విధంగా  చర్యలు చేపట్టాలని సర్పంచి అనసూర్య తెలిపారు. త్వరలో సమస్యను పరిష్కరిస్తామని రేంజ్ అధికారి శ్రావణ్ కుమార్ తెలిపారు. మండలంలోని వివో భవనాలు పూర్తయిన బిల్లులు చెల్లించడం లేదని సర్పంచ్ చిరంజీవి ఆరోపించారు.

త్వరలో చెల్లిస్తామని ఏపీఎం మోహన్దాస్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ రామ్మోహన్ రావు, ఎంపీడీవో బిఎస్ ప్రవీణ్ కుమార్, పిఎసిఎస్ చైర్మన్ ఓం ప్రకాష్, ఆర్టికల్చర్ అధికారి సుప్రజ, ఇన్చార్జి ఎఫ్ఆర్ఓ శ్రావణ్ కుమార్, పశువైద్యాధికారి లక్ష్మీనారాయణ, ఏపీఎం మోహన్దాస్, ఏపీ ఓ మురళి, డాక్టర్ శ్రీనివాస్, లైన్ ఇన్స్పెక్టర్ ధర్మయ్య, సర్పంచులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు