పట్టభద్రుల ఓటర్లకు బిగ్ అప్డేట్
06-11-2026 | 11:38pm
హైదరాబాద్: తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల(Graduate MLC Elections) ఓటరు నమోదుకు భారీగా దరఖాస్తులు వచ్చాయి. హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్నగర్ నియోజకవర్గంలో 5.77 లక్షలు, నల్గొండ–వరంగల్–ఖమ్మం నియోజకవర్గంలో 6.52 లక్షల దరఖాస్తులు అందినట్లు ఎన్నికల సంఘం వెల్లడించింది.
నవంబర్ 25న Draft Voter List విడుదల చేయనున్నారు. అదే రోజు నుంచి డిసెంబర్ 10 వరకు అభ్యంతరాలు, వినతులు స్వీకరిస్తారు. డిసెంబర్ 30న Final Voter List ప్రకటించనున్నారు. అభ్యంతరాల స్వీకరణ సమయంలోనూ ఓటు నమోదు చేసుకునే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ వరకు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టం చేశారు.