సమ్మె బాట పట్టిన ఏఎన్ఎంలు.. చిన్నారులకు అందని టీకాలు

26-10-2026 | 08:37pm

14వ రోజుకు చేరిన సమ్మె 

గ్రామాలలో నిలిచిన వైద్య సేవలు

బెజ్జూర్ అక్టోబర్ 26 (విజయక్రాంతి): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా(Komaram Bheem Asifabad district) వ్యాప్తంగా ఏఎన్ఎంలు సమ్మెబాట పట్టారు. జిల్లా కేంద్రంలో 14 రోజులుగా నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు ఏఎన్ఎంలు తెలిపారు బోనాలతో నిరసన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. 15, 20 సంవత్సరాలుగా విధులు నిర్వహించినప్పటికీ ప్రభుత్వం గుర్తించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

సమాన పనికి సమాన వేతనం, రెగ్యురేషన్, ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత ఎలాంటి సౌకర్యాలు లేక నష్టపోతున్నామని తెలిపారు. కొమురం భీం జిల్లాలో 332 మంది రెండవ ఏఎన్ఎంలు ఉన్నారని వారిని ప్రభుత్వం వెంటనే గుర్తించి రెగ్యులర్ చేసి ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం స్పందించే వరకు నిరసన కార్యక్రమం ఆందోళన కార్యక్రమాలు చేపడుతూనే ఉంటామని తెలిపారు..

ఏఎన్ఎంల సమ్మెతో నిలిచిన వైద్య సేవలు 

14 రోజులుగా ఏఎన్ఎంలు సమ్మె బాట పట్టడంతో గ్రామాలలో చిన్నారులకు, గర్భిణీలకు టీకాలు, హెల్త్ క్యాంపులు ఎలాంటి వైద్య సేవలు అందడం లేదని గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి గ్రామాల్లో వైద్య సేవలు అందేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు