వర్షాలు కురవాలని కప్పతల్లికి జలాభిషేకం
13-10-2026 | 03:42pm
బెజ్జూర్ అక్టోబర్ 13 (విజయ క్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలో(Bejjur Mandal Headquarters) వర్షాలు కురవాలని కప్పతల్లికి,, గ్రామంలోని ఆలయాలలో దేవత మూర్తులకు జలాభిషేకం నిర్వహించారు. నెల రోజులుగా వర్షాలు లేకపోవడంతో వరి, పత్తి,కంది తదితర పంటలు సైతం ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వర్షాలు కురవాలని పాడిపంట బాగుండాలని గ్రామంలో కప్పతల్లి కి జల అభిషేకం నిర్వహించి డప్పుసప్పులతో గ్రామంలోని దేవతమూర్తులకు మహిళలు చిన్న పెద్ద తేడా లేకుండా ఆలయంలో అభిషేకాలు నిర్వహించి వర్షాలు కురవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు.