హత్య కేసు చేదించిన పోలీసులు
వివరాలు వెల్లడించిన ఎస్పీ నితిక పంత్
ఆసిఫాబాద్, సెప్టెంబర్21( విజయ క్రాంతి): ఆసిఫాబాద్ మండలంలోని బూరుగుడ గ్రామంలో వృద్ధురాలు హత్య కేసు పోలీసులు వేగంగా చేదించారు. హత్యకు సంబంధించిన వివరాలను ఎస్పీ నితికా పంత్ గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వెల్లడించారు. మద్యానికి బానిసైనా ధనుంజయ్ వృద్ధురాలు పైన ఉన్న బంగారంపై కన్నేశాడు. ఆగస్టు 30న వృద్ధురాలి ఇంట్లో చొరబడిన నిందితుడు మల్లక్క ను బండరాయితో కొట్టి చెవి కమ్మలను దోచుకోవడంతో పాటు ఇంట్లో ఇతరవస్తుల కోసం వెతికాడు.
ఏమి దొరకకపోవడంతో అక్కడి నుండి పారిపోయాడు.ఈనెల 21న వృద్ధురాలి ఇంటి నుండి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు ఇంట్లోకి వెళ్లి చూసేసరికి మల్లక్క మృతి చెంది ఉంది. దీంతో బంధువులకు సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ధనుంజయ్ దొంగలించిన బంగారాన్ని అమ్మేందుకు ప్రవీణ్ సహాయంతో మహేష్ కు రూ : 32 వేల కు విక్రయించాడు. దాంట్లో నుండి మూడు వేల రూపాయలను ప్రవీణ్ కమిషన్ తీసుకొని మిగతా 29 వేలను ధనంజకిచ్చాడు. వచ్చిన డబ్బులతో దుబారా ఖర్చు పెట్టుతుండడంతో పోలీసులు అతనిపై నిఘా పెట్టారు.
అనుమానం రావడంతో విచారణ చేపట్టగా హత్య చేసినట్లుగా ఒప్పుకున్నాడు. దీంతో ధనుంజయతో పాటు అతనికి సహకరించిన ప్రవీణ్ బంగారం కొనుగోలు చేసిన మహేష్ పై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు ఎస్పీ వెల్లడించారు. కేసు ను చేదించిన సిబ్బంది ప్రేమ్ సింగ్ , శేషారావుతోపాటు డిఎస్పి అశోక్ ,సిఐ రవిని అభినందించారు.గుర్తుతెలియని వ్యక్తుల నుండి ఎలాంటి రసీదు లేకుండా బంగారం కానీ ఇతర వస్తువులు కొనుగోలు చేయవద్దని ఎస్పీ సూచించారు.