చీలపల్లి ప్రజల సమస్యలు పరిష్కరిస్తాం

19-09-2026 | 02:19pm
  1. వారం రోజుల్లో రెండు వాగులపై కల్వర్టుల పనులు ప్రారంభం
  2. ఎమ్మెల్సీ దండే విఠల్

ఆసిఫాబాద్ ( విజయక్రాంతి): సిర్పూర్‌ టి మండలంలోని చీలపల్లి (Chilapalli)గ్రామ ప్రజలు వర్షాకాలంలో ఎదుర్కొంటున్న రాకపోకల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నట్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ (MLC Dande Vitthal) తెలిపారు. చీలపల్లి వెళ్లే మార్గంలో ఉన్న రెండు వాగులపై కల్వర్టుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్‌ దృష్టికి సమస్యను తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.కల్వర్టుల నిర్మాణానికి కలెక్టర్‌ నిధులు మంజూరు చేశారని తెలిపారు.

శాశ్వత వంతెన నిర్మాణానికి అటవీ శాఖ అనుమతులు అవసరం కావడంతో కొంత సమయం పట్టే అవకాశం ఉందన్నారు. అప్పటివరకు ప్రజలు ఇబ్బందులు పడకుండా వారం రోజుల్లో రెండు వాగులపై కల్వర్టుల నిర్మాణ పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చీలపల్లి సర్పంచ్‌, ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు