శాంతియుత వాతావరణం లో వినాయక నిమజ్జనాలు నిర్వహించాలి

19-09-2026 | 02:54pm

దౌల్తాబాద్‌, బోరపట్లలో ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ పరితోష్‌ పంకజ్‌

హత్నూర, సెప్టెంబర్‌ 19: వినాయక నిమజ్జన కార్యక్రమాలను శాంతియుత వాతావరణంలో ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించాలని సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్‌ పంకజ్‌ (SP Paritosh Pankaj) అధికారులను ఆదేశించారు. శనివారం హత్నూర మండలంలోని దౌల్తాబాద్‌, బోరపట్ల గ్రామాల్లో నిమజ్జన ప్రాంతాలను పరిశీలించిన ఆయన.. భద్రతా ఏర్పాట్లపై అధికారులతో మాట్లాడుతూ నిమజ్జన ప్రాంతాల్లో భక్తుల రద్దీ, వాహనాల రాకపోకలు, ట్రాఫిక్‌ నియంత్రణ, విద్యుత్‌ భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ తెలిపారు. నిమజ్జనానికి వచ్చే ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పిస్తూ ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలన్నారు. పోలీస్‌, రెవెన్యూ, పంచాయతీరాజ్‌, విద్యుత్‌ తదితర శాఖలు సమన్వయంతో పనిచేసి నిమజ్జన కార్యక్రమాలు సజావుగా పూర్తయ్యేలా చూడాలని సూచించారు. ఎస్పీ వెంట తాసిల్దార్ పర్వీన్ షేక్ , సీఐ రమణారెడ్డి, ఎస్‌ఐ, శ్రీధర్ రెడ్డి,  తదితర అధికారులు, సిబ్బంది ఉన్నారు.

మరిన్ని వార్తలు