అటవీ శాఖ ఆధ్వర్యంలో వన్యప్రాణి వారోత్సవాలు

02-10-2026 | 05:42pm

పెంచికలపేట, అక్టోబర్ 2 (విజయక్రాంతి):జాతీయ వన్యప్రాణి వారోత్సవాలను(National Wildlife Week celebrations) పురస్కరించుకుని పెంచికలపేట అటవీ రేంజ్ పరిధిలో అటవీ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. డిప్యూటీ రేంజ్ అధికారి ఆస్మా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆశ్రమ పాఠశాల విద్యార్థులతో కలిసి ఎల్లూరు నుంచి ఎలుకపల్లి వరకు  ర్యాలీ నిర్వహించారు.

అడవులు, వన్యప్రాణుల ప్రాధాన్యతపై విద్యార్థులు, స్థానిక ప్రజలకు అవగాహన కల్పించారు. పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో అడవులు, వన్యప్రాణుల పాత్ర ఎంతో కీలకమని అధికారులు తెలిపారు. వన్యప్రాణులను సంరక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సెక్షన్ అధికారులు అహ్మద్, అలీ, గోవింద్, బీట్ అధికారులు సతీష్, కళ్యాణ్, సంగదీప్, స్వర్ణలత, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు