ఆశ్రమ ఉన్నత పాఠశాలలో గణపయ్యకు పూజలు
బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండలం(Bejjur Mandal)లోని సోమిని గిరిజన ఆశ్రమ పాఠశాల(Ashram High School)లో గణపయ్యకు ఘనంగా మాజీ జెడ్పిటిసి పంంద్రం పుష్పలత, ప్రధానోపాధ్యాయుడు భిక్షమయ్య దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గత తొమ్మిది రోజుల నుండి ఆశ్రమ ఉన్నత పాఠశాల సోమిని కాంప్లెక్స్ లో కొలువుదిరిన గణపయ్యకు 9 వ రోజు పూజా కార్యక్రమంలో పాల్గొని గణనాథునికి ప్రత్యేక పూజలు జెడ్పిటిసి దంపతులు పంద్రం పుష్పలత, బిక్షమయ్య దంపతులు నిర్వహించి తీర్థప్రసాదాలు వితరణ చేశారు.
అనంతరం భక్తులకు అన్న ప్రసాదం వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ... ఆశ్రమ పాఠశాలలో గణనాథుని ఏర్పాటు చేసి తొమ్మిది రోజులపాటు పూజా కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బిక్షమయ్య, ఉపాధ్యాయ బృందం విద్యార్థులు స్థానిక మహిళలు నాయకులు పాల్గొన్నారు.