వేలం పాటలో రూ. 22 వేలు పలికిన లడ్డు...
23-09-2026 | 07:56pm
తాడ్వాయి, సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం(Tadwai Manda) కరడుపల్లి గ్రామంలో నెహ్రు బాలుర సంఘం గణేష్ మండపం వద్ద నిర్వహించిన వేలం పాటలో లడ్డుకు రూ.22 వేల పాట పాడి భక్తుడు దక్కించుకున్నాడు. నేతాజీ యూత్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వేలంపాటలో రూ. 15,500 పాట పాడి లడ్డూను మరో భక్తుడు దక్కించుకున్నాడు. లడ్డూలకు నిర్వహించిన వేలంపాటలో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు.