జీడీసీ, పీహెచ్ సీ, ఎమ్మార్వో, హాస్టల్ ను తనిఖీ చేసిన కలెక్టర్
మునిపల్లి సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): మండలంలోని బుదేరా మహిళా డిగ్రీ కళాశాల(Women's Degree College), మునిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(Primary Health Centre), ఎమ్మార్వో కార్యాలయం, మునిపల్లి ఎస్సీ హాస్టల్ ను బుధవారం జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్(District Collector Prateek Jain) ఆకస్మికంగా తనిఖీ చేసి పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ముందుగా గురుకుల మహిళా డిగ్రీ కళాశాలతో పాటు లైబ్రేరి, వంట శాల, వసతి గృహం తనిఖీ చేసి విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు సూచించారు.
అలాగే కళాశాలలో ప్రహారీ గోడ ముఖ్యం కాదు.. చదువుల కోసం డబ్బులు ఖర్చు చేయాలి తప్ప.. డబ్బులు వృదా చేయకూడదన్నారు. విద్యార్థులకు నీటి సమస్య ఉండకూడదన్నారు. అనంతరం భోజనం ఎలా ఉంది.. సదువులు బాగా చెబుతున్నారా.. అంటూ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అక్కడ నుంచి మునిపల్లి పీహెచ్ సీ ని తనిఖీ చేసి రోగులతో స్వయంగా మాట్లాడారు. అలాగే ఆసుపత్రికి పెయింటింగ్ వేయించాలని డాక్టర్ సంధ్యారాణిని ఆదేశించారు.
అక్కడ నుంచి ఎమ్మార్వో కార్యాలయాన్ని తనిఖీ చేసి భూ భారతి దరఖాస్తులు పెండింగ్ లో ఉండొద్దు.. ఎస్ఐఆర్‌పై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. అనంతరం ఎమ్మార్వో నూతన కార్యాలయ భవనానికి సంబంధించి స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మునిపల్లి ఎస్సీ హాస్టల్ ను తనిఖీ చేసి మరుగుదొడ్ల వద్ద ప్లోరింగ్ వేయించాలని హాస్టల్ వార్డెన్ రామప్పకు సూచించారు. కలెక్టర్ వెంట సోషల్ వెల్ఫెర్ డీఈ రాజు, జిల్లా సోషల్ వెల్ఫేర్ జిల్లా అధికారి, అందోల్ నియోజకవర్గ ప్రత్యేకాధికారి జగదీశ్వర్, యూత్, స్పోర్ట్స్ ఆఫీసర్ అఖిలేష్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, మండల ప్రత్యేకాధికారి రామాచారి, ఎమ్మార్వో రంగారావు, ఆర్ఐ సాయికిరణ్, పంచాయతీ కార్యదర్శి నర్సింలు తదితరులు ఉన్నారు.