ఫ్యామిలీ డే, సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించాలి

13-10-2026 | 04:44pm

సేవా సమితి అధ్యక్షురాలు వి. రమ పిలుపు

ఇల్లెందు, అక్టోబర్ 13 (విజయక్రాంతి): సింగరేణి యాజమాన్యం ఆధ్వర్యంలో ఈ నెల 18న ఇల్లందు జేకే కాలనీలోని బ్లాక్ డైమండ్ స్టేడియంలో నిర్వహించనున్న ఫ్యామిలీ డే, సద్దుల బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించాలని సింగరేణి సేవా సమితి(Singareni Seva Samithi) అధ్యక్షురాలు వి. రమ పిలుపునిచ్చారు. ఈ మేరకు వై.సి.ఓ.ఏ క్లబ్‌లో సేవా సమితి సభ్యులు, ట్రైనర్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు.

వేడుకల్లో సేవా సభ్యులు, ట్రైనర్లు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలన్నారు. సేవా సమితి ఆధ్వర్యంలో వివిధ స్టాళ్లు ఏర్పాటు చేయడంతో పాటు బతుకమ్మ ఆటపాటలు, కోలాటం నిర్వహించనున్నట్లు తెలిపారు. బతుకమ్మ పోటీల్లో ఉత్తమంగా నిలిచిన వాటికి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు ఐదు కన్సొలేషన్ బహుమతులు అందజేస్తామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో సీనియర్ పర్సనల్ ఆఫీసర్ జి. సుధాకర్, సేవా సమితి కార్యదర్శి సులక్షణ, ఇతర సభ్యులు, ట్రైనర్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు